పావలా శ్యామలకు తుది వీడ్కోలు
NEWS Jul 29,2026 04:13 pm
గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింనగర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోం ఫౌండేషన్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మురళీమోహన్, నరేష్, శివబాలాజీ, రాజీవ్ కనకాల, రఘుబాబు, మాదాల రవి, కరాటే కల్యాణి, అనిత చౌదరి, హేమ వంటి వారంతా హాజరై పావలా శ్యామలకు నివాళులు అర్పించారు. ,