రామ్‌చరణ్ ఆరోగ్యం కోసం పూజలు
NEWS Jul 28,2026 09:36 pm
పాల్వంచ: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆయన సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం మెగా అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాసీం ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి బ్రహ్మంగారి గుడి ప్రాంగణంలోని పంచముఖ అభయాంజనేయ స్వామి ఆలయం, సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో భాషా, హరీష్, ముడు లక్ష్మణ్, సాయి, తేజ, బాలాజీ, మస్తాన్, సతీష్, పురోహితుడు రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.