పేపర్ లీక్ చేస్తే పదేళ్ల జైలు..బిల్లుకి కేబినెట్ ఓకే
NEWS Jul 24,2026 03:59 pm
దేశంలో వివిధ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ప్రశ్నపత్రాల లీక్‌ల ఘటనలో దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించింది.