బిగ్‌బాస్ ఛాన్స్ కోసం పాదయాత్ర
NEWS Jul 23,2026 09:41 pm
బిగ్‌బాస్ తెలుగు సీజన్-10లో అవకాశం కోసం మంచిర్యాల జిల్లా కవ్వాల్ (జన్నారం) గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తుడుం నాగార్జున హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. ఈనెల 17న ప్రారంభమైన యాత్ర ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. గత ఐదేళ్లుగా బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నానని, ఈసారి కూడా ఆడిషన్లకు దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. తనలాంటి ఆటో డ్రైవర్‌లకు కూడా అవకాశం కల్పించాలని నాగార్జున కోరుతున్నాడు. ఆయన పాదయాత్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.