T20 చరిత్రలోనే తోపు కెప్టెన్‌గా శ్రేయాస్
NEWS Jul 23,2026 08:29 pm
భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రేయస్ అయ్యర్‌కు అదృష్టం మైండ్ బ్లాక్ చేస్తోంది. జింబాబ్వేతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో అయ్యర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అయ్యర్‌కు ఇది వరుసగా 8వ టాస్ విజయం కావడం విశేషం. దీంతో ఇప్పటి వరకు వరుసగా 7 టాస్‌లు గెలిచి అగ్రస్థానంలో ఉన్న ధోనీ రికార్డును శ్రేయస్ బద్దలు కొట్టాడు. అయ్యర్ పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా 8 మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలుస్తూనే వచ్చాడు