ప్రశ్న రావణ్ కేసులో విచారణకు గమన డుమ్మా
NEWS Jul 22,2026 02:48 pm
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్ కేసులో గన్నవరం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావలసిన ‘ప్రశ్న’ చానల్ సీఈవో గమన, ఇంద్రసేన చౌదరి డుమ్మా కొట్టారు. కొద్దిరోజుల క్రితం జరిగిన విచారణ పూర్తయ్యాక పోలీసులు వారిద్దరికీ నోటీసులు ఇచ్చారు. మంగళవారం మళ్లీ రావాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు తీసుకుని వెళ్లిపోయారు. రావణ్‌ను అరెస్టు చేశాక పోలీసులు గమన, ఇంద్రసేనను మూడుసార్లు విచారణకు పిలిచారు.