బీఆర్ఎస్ ని వీడే ప్రసక్తే లేదన్న మల్లారెడ్డి
NEWS Jul 20,2026 06:40 pm
పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల తన పార్టీ మార్పుపై సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు.తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. బీఆర్ఎస్ నాయకత్వంపై తనకు పూర్తిగా విశ్వాసం ఉందన్నారు.