బండి - ఈటల మధ్య కుదిరిన సయోధ్య
NEWS Jul 18,2026 10:57 pm
తెలంగాణ బీజేపీలో ఎంతో కాలంగా విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరింది. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందకు రంగంలోకి దిగిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్.. ఈటల రాజేందర్, బండి సంజయ్‌తో సమావేశం నిర్వహించారు. ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఈటల, బండి మధ్య రాజీ కుదిర్చారు.