నాణ్యమైన విద్య, భోజనం అందించాలి: కలెక్టర్
NEWS Jul 18,2026 08:58 pm
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నర్సాపూర్(జి) జిల్లా పరిషత్ హైస్కూల్‌ను తనిఖీ చేసి విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రత, హాజరు నమోదును పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి, భైంసా మండలంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టును సందర్శించి తాగునీటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.