మోడీ,చంద్రబాబు వచ్చాక పరిస్థితులు మారాయి
NEWS Jul 18,2026 11:57 am
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి నేతలు అధికారంలోకి వచ్చాక దేశంలో పరిస్థితులు పూర్తిగా మారాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఎవరికి రుణాలు ఇవ్వాలో నిర్దేశించే వారని, కానీ ఇప్పుడు బ్యాంకులు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి అర్హులైన వారికి అండగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన 'క్రెడిట్ అవుట్‌రీచ్' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.