అంగన్‌వాడీ సిబ్బందికి శుభవార్త
NEWS Jul 17,2026 05:32 pm
అంగన్వాడీ సిబ్బందికి AP సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. అంగన్వాడీలకు 'తల్లికి వందనం' పథకం వర్తింపచేస్తున్నట్టు ప్రకటించారు. టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈనెల 22న తల్లికివందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈపథకానికి రూ.10,120.78 కోట్ల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది.