గీత దాటితే గద్దె దిగాల్సిందే
NEWS Jul 17,2026 10:14 am
చెన్నై: మంత్రులు ఎవరైనా తప్పు చేస్తే పదవి నుంచి తొలగిస్తామని CM విజయ్ హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు మంత్రులు వెళ్లి పరిశీలన చేపట్టే సందర్భంగా వీడియో తీయడం వంటి చర్యలు వివాదాస్పదంగా మారడంతో ఇకపై అనవసరంగా వెళ్లకూడదని, వెళ్లినా వీడియోలు తీయకూడదని, వాటిని సోషల్ మీడియాల్లో పెట్టకూడదని సూచించారు. కొందరు మంత్రుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారని, అవినీతిరహిత పాలన కొనసాగించేందుకు అందరూ సహకరించాలని కోరినట్లు తెలిసింది.