ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలపై KTR ప్రశంసలు
NEWS Jul 16,2026 03:16 pm
సాధారణంగా బీఆర్ఎస్-టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. అయితే ఈసారి భిన్నంగా ఏపీ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమయిన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ పట్టిసీమ నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని ఎత్తిపోస్తోందన్నారు కేటీఆర్. రైతుల ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రశంసలు కురిపించారు.