ఏపీ మద్యం రవాణా కేసులో నిందితులకి ఈడీ కస్టడీ
NEWS Jul 16,2026 03:13 pm
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం రవాణా కేసులో లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కు మూడు రోజుల ఈడీ కస్టడీని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు.