ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి గవర్నర్ పరామర్శ
NEWS Jul 16,2026 03:36 pm
హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డిప్యూటీ సీఎం పవన్ గత కొంతకాలంగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. ముంబైనుంచి వచ్చిన పవన్ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు.