గో మూత్రంతో.. గడియారం!
NEWS Jun 29,2026 10:48 am
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు గోమూత్రంతో నింపి, డబ్బాలో ఒక కాపర్, ఒక జింక్ కడ్డీ చొప్పున 2 డబ్బాల్లో వేర్వేరుగా పెట్టాలి. ఒక డబ్బాలోని కాపర్ కడ్డీని మరో డబ్బాలోని జింక్ కడ్డీని తీగతో కలపాలి. తర్వాత ఒక డబ్బాలో విడిగా ఉన్న జింక్ కడ్డీ నుంచి ఒక తీగ లాగి గడియారంలోని ఒక టెర్మినల్‌కు, మరో డబ్బాలోని కాపర్ కడ్డీ నుంచి తీగ లాగి గడియారంలోని మరో టెర్మినల్‌కు కనెక్షన్ ఇవ్వాలి. గడియారం పనిచేస్తుంది’ అని గోశాల ప్రతినిధులు పరిమి వెంకట రాఘవులు, గద్దే రత్నాజీ చెప్పారు. ఒకసారి గోమూత్రంతో డబ్బాలను నింపితే గడియారం 14 రోజులు తిరుగుతుందని తెలిపారు.