మహిళకు ప్రాణదాతగా నిలిచిన వేణు
NEWS Jun 19,2026 11:10 pm
మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు అత్యవసర సర్జరీ కోసం ఏబీ పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించారు. అర్ధరాత్రి సమయంలో సమాచారం అందుకున్న పుల్లూరి వేణు స్పందించి రక్తదానం చేసి మహిళ ప్రాణాలను కాపాడేందుకు సహకరించాడు. అత్యవసర పరిస్థితిలో సమయంతో సంబంధం లేకుండా సేవలు అందించిన బ్లడ్ బ్యాంక్ సిబ్బందిని, ఫోన్ చేసిన వెంటనే స్పందించిన వేణును 21వ వార్డు కౌన్సిలర్ ఖాజా అజీమోద్దిన్, ఉదయ్ కుమార్, రోగి కుటుంబ సభ్యులు అభినందించారు.