స్వర్గలోక రథాన్ని అందించిన డాక్టర్
NEWS Jun 19,2026 06:23 pm
నిర్మల్ జిల్లా ప్రముఖ వైద్యులు డా. దేవేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో న్యూ లోలం గ్రామానికి స్వర్గలోక రథాన్ని అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను గ్రామస్తులు సన్మానించారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా సేవకు ఎల్లప్పుడూ ముందుండే డాక్టర్ దేవేందర్ రెడ్డి సేవలను కొనియాడుతూ గ్రామస్తులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్, వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.