కూతురి హత్య కేసులో తల్లి అరెస్ట్
NEWS Jun 12,2026 11:49 pm
కర్ణాటకలో 5ఏళ్ల కూతురు హత్య కేసులో న్యాయవాది ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి చిన్నారిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటన అనంతరం పరారైన ప్రియాంకను వారం రోజుల గాలింపు తర్వాత సకలేశ్‌పూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రియుడు మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.