కఠిన శిక్ష విధించాలని డీజీపీకి వినతి
NEWS Jun 12,2026 11:36 pm
ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటనపై నిందితుడికి ఉరి శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బాధిత బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. అనంతరం విషయం బయటపడుతుందనే భయంతో అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు నుంచి బాలికను కిందికి తోసివేయడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించడంతో పాటు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి బండారు విజయలక్ష్మి, తెలంగాణ హైకోర్టు న్యాయవాది కరుణాసాగర్ పాల్గొన్నారు.