రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ
NEWS Jun 12,2026 11:35 pm
ఇల్లందు పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు పాల్గొని రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఏకైక పంటల సాగుకే పరిమితం కాకుండా అంతర పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అంతర పంటల వల్ల భూసారం పెరగడంతో పాటు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతర పంటల ప్రయోజనాలపై వ్యవసాయ అధికారులు గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని కోరారు.
<