మోదీ అరుదైన రికార్డు!
NEWS Jun 10,2026 02:24 pm
ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూను అధిగమించి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. ప్రధానిగా నెహ్రూ 4,398 రోజులు చేశారు. ఇందిరా 3వ స్థానం. ఆమె వరుసగా 4,077 రోజులు పదవిలో ఉన్నారు.