చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
NEWS May 23,2026 11:08 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ఎస్సీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 10న నల్లగట్ల ప్రశాంత్ ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో రాగం అశోక్, ఇసంపల్లి జంపయ్యలు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడు రాగం అశోక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 206 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.