మురికి కాలువ సమస్యకు సర్పంచ్ చొరవ
NEWS May 21,2026 04:34 pm
నర్సాపూర్(జి) మండలం టెంబూర్ణి గ్రామంలో ప్రధాన మురికి కాలువ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామం మధ్యలో ఉన్న ఈ కాలువ వల్ల వర్షాకాలంలో మురుగు నీరు రోడ్లపైకి, సమీప ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడేవారు. స్థానిక సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో NREGS నిధుల నుంచి సుమారు రూ.10 లక్షలు కేటాయించి కాలువ లైనింగ్ పనులు చేపట్టారు. పనులు పూర్తికావడంతో వర్షాకాల సమస్య తగ్గుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కూడా పాల్గొన్నారు.