మాదిగప్రోలులో ఇల్లు దగ్దం
NEWS May 21,2026 12:06 am
లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగప్రోలు గ్రామంలో రైతు పొలంలో వేసిన మంటల నుంచి ఎగిరిన నిప్పురవ్వలు ఇంటిపై పడటంతో అశోక్‌నగర్ పంచాయతీ వర్కర్ పాయం సతీష్ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో 100 బస్తాల ధాన్యం, 3 వ్యవసాయ మోటర్లు బైకు, ఇంటి సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతై సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. సర్పంచ్ ఈసం కళ్యాణి లక్ష్మీదేవి, ఉపసర్పంచ్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచాయతీ ట్యాంకర్‌తో మంటలను అదుపు చేశారు. బాధితులకు ప్రభుత్వ సహాయం అందించాలని ఎమ్మార్వో, ఎస్ఐలకు సర్పంచ్ సమాచారం అందించారు.