“దీక్ష కాదు.. పొలిటికల్ స్టంట్: నజీర్ అహ్మద్”
NEWS May 20,2026 11:42 am
ఎమ్మిగనూరులో కోతుల బావి స్థల వివాదంపై వైసీపీ నేత నజీర్ అహ్మద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దయాసాగర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కౌన్సిల్ సమావేశంలో షెడ్ల నిర్మాణానికి అంగీకరించి, ఇప్పుడు గుడి పేరు చెప్పి దీక్ష చేయడం రాజకీయ డ్రామా అని ఆరోపించారు. దేవుడి పేరుతో ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకుల ఆరోపణల మధ్య చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.