ఉదయనిధి వ్యాఖ్యలపై రఘునందన్ ఫైర్
NEWS May 13,2026 11:48 am
తమిళ మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ, మనుషుల మధ్య దూరాన్ని పెంచి, విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న తన పాత నినాదాన్ని మళ్లీ లేవనెత్తారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న ఉదయనిధిపై తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అధికారం కోల్పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు, సనాతన ధర్మంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే ప్రజలు డీఎంకేని తిరస్కరించారు, సర్వజనుల శ్రేయస్సును కోరే సనాతన ధర్మాన్ని విమర్శించడం మానుకోవాలని, హిందూ సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఉదయనిధికి సూచించారు.