ఏనుగు నరసింహారెడ్డికి ముద్దం నరసింహ స్వామి AI పుస్తకాల అందజేత
NEWS May 12,2026 01:32 pm
హైదరాబాద్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డికు రచయిత, సీనియర్ జర్నలిస్టు ముద్దం నరసింహ స్వామి తాను రచించిన కృత్రిమ మేధస్సు (AI) అంశాలపై పుస్తకాలను అందజేశారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ముద్దం నరసింహ స్వామి రచనా కృషిని అభినందిస్తూ, AIపై తెలుగు భాషలో అవగాహన పెంచే ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు.