కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కొడుకును లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ప్రత్యర్థులు కుటుంబాన్ని వివాదాల్లోకి లాగుతున్నారని Xలో మండిపడ్డారు. బీసీ నేత కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ప్రధాని మోదీ సభకు ముందు తనపై జరుగుతున్నది కుట్రేనని ఆరోపిస్తూ.. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందన్నారు.