ఏడేళ్ల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోలో జడ్జిగా కనిపించనున్నారు. 2019లో నిర్మాణ సంస్థతో విభేదాల కారణంగా ఆయన షోకు దూరమయ్యారు. ఇటీవల ప్రత్యేక ఎపిసోడ్ షూటింగ్‌లో పాల్గొనడంతో రీఎంట్రీపై ఆసక్తి పెరిగింది. ఇది ఒక్క ఎపిసోడ్‌కేనా లేక పూర్తి స్థాయి కొనసాగింపా అన్నది తేలాల్సి ఉంది. నాగబాబు రీఎంట్రీతో కంటెస్టెంట్లకు ఉత్సాహం పెరగడంతో పాటు షో రేటింగ్స్ కూడా మెరుగయ్యే అవకాశముందని భావిస్తున్నారు.