తెలంగాణలో భానుడి భగభగలు
19వ తేదీ నుంచి వడగండ్ల వానలు
NEWS Apr 17,2026 11:40 am
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీల మార్క్‌కు చేరువయ్యాయి. 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా, మరో 9 జిల్లాల్లో 43 డిగ్రీలకంటే ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా జైనలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 19వ తేదీ నుంచి పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వడగండ్ల వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.