ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుక
NEWS Apr 05,2026 04:39 pm
మెట్‌పల్లి: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వెల్లుల్ల గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గూడూరు తిరుపతి మాట్లాడుతూ సామాజిక సమానత్వం, న్యాయం, సమాన అవకాశాల కోసం ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చెరువు చైర్మన్ నూతుల రాజారెడ్డి, హరీష్, నాగిరెడ్డి, ప్రకాష్, సురేష్, మారుతి అంజయ్య, గణపతి తదితరులు పాల్గొన్నారు.