రాఘవ్ చడ్ఢాను MPగా కూడా తొలగిస్తారా?
NEWS Apr 04,2026 08:00 pm
రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్ఢాను తొలగించిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఆయన్ను ఎంపీగా కూడా తొలగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ ఎంపీని తొలగించే హక్కు పార్టీకి ఉండదు. పార్టీ పదవి నుంచి సస్పెండ్ చేసినా రాజ్యసభ సభ్యత్వం కొనసాగుతుంది. ఆరేళ్లు సభ్యుడిగా ఉంటారు. విభేదాలున్నా సరే ఆప్ నుంచి రాఘవ్ చడ్ఢాను ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేయకపోవచ్చని తెలుస్తోంది.