తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని ఎన్‌పీడీసీఎల్ ఆపరేషనల్ సర్కిల్ కార్యాలయం ఎదుట వంటా–వార్పుతో ధర్నా నిర్వహించారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఆర్టిసన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.