రూ.4వేల కోట్లతో ‘రామాయణ’ మూవీ
NEWS Feb 25,2026 07:04 pm
నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమా కోసం భారీగా బడ్జెట్ పెడుతున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. ‘ఈ సినిమాపై నేను రూ.4వేల కోట్లు పెట్టుబడి పెట్టాను. పార్ట్ 1 షూటింగ్ పూర్తయింది. మూవీ స్టార్ట్ చేసే ముందు తగినంత బడ్జెట్ ఉందా అని అందరూ అడిగారు. అప్పు తీసుకోకుండా ఫస్ట్ పార్ట్ పూర్తి చేశాను. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియకుండానే, దానంతట అదే జరిగిపోతుంది’ అని చెప్పారు.