అనంతగిరి : PRE JE పైన ఫిర్యాదు.
NEWS Feb 26,2026 12:05 am
అనంతగిరి మండలకేంద్రంలోని ప్రజల సమస్యలను పట్టించుకోని పంచాయతీరాజ్ శాఖ అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని TDP సీనియర్ నాయకుడు అంటిపర్తి బుజ్జిబాబు డిమాండ్ చేశారు. పెద్దబిడ్డ పంచాయితీ కంటిపురం గ్రామస్థుల సమస్యలను తెలపడానికి 3 వారాలుగా కార్యాలయం చుట్టూ తిరిగిన (PRE JE) జాడ కరువైందని తెలిపారు. కనీసం చరవాణిలో కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఇలాంటి అధికారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు.