కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఏంబడి
NEWS Feb 09,2026 08:43 am
నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏంబడి రాజేశ్వర్ రాంనగర్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొర్ర ఉమేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అభివృద్ధి, ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగించాలంటే ఉమేందర్‌ను కౌన్సిలర్‌గా గెలిపించాలని కాలనీవాసులను కోరారు. మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.