మంచు మోహన్ బాబు బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఆ ఫీజులను వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ SFI లీడర్లు ధర్నా చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన మోహన్ బాబు వారిని తన బౌన్సర్ల చేత కిడ్నాప్ చేయించి, ఫామ్ హౌస్ లో బంధించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు మోహన్ బాబు ఫామ్ హౌస్ కి వెళ్లి బౌన్సర్లను అరెస్ట్ చేశారు.