వాట్సాప్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
NEWS Feb 03,2026 02:19 pm
వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని సూచించింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో కోర్టు వ్యాఖ్యలు చేసింది. ‘మా దేశ ప్రైవసీపై మీరు ఇష్టమైనట్టు ఆటలు ఆడలేరు. ఇక్కడి డేటాలో ఒక్క అక్షరం/అంకె కూడా షేర్ చేయడానికి మేం అనుమతివ్వం’ అంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు.