పెద్దపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు సింహంపై 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు పార్టీ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ప్రకటించిన పథకాలు సక్రమంగా అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేసుకోవద్దని ప్రజలను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిజంగా పనిచేసే అభ్యర్థులను గుర్తించి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.