రామ్‌చరణ్ ‘డబుల్’ ఆనందం!
NEWS Feb 01,2026 03:06 pm
రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో కొణిదెల కుటుంబంలో సందడి నెలకొంది. తాజాగా రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా ‘డబుల్’ ఆనందం వ్యక్తం చేశారు. తన సతీమణితో కలిసి ఇంతకుముందు దిగిన స్పెషల్ ఫొటోను పంచుకున్నారు. ‘‘మాకు బాబు, పాప పుట్టారన్న విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని కలిగి ఉండటం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం. మాకు అండగా నిలిచిన వారికి థాంక్స్’’ అని చరణ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.