‘గ’ అక్షరంతోనే 1600 మంది పేర్లు!
NEWS Feb 01,2026 12:09 pm
నిర్మల్ జిల్లా కుంటాల గ్రామ జనాభా 4,000పైగా ఉండగా అందులో 1600 మంది పేర్లు ‘గ’ అనే అక్షరంతోనే మొదలవుతాయి. ఈ గ్రామంలోని గజ్జలమ్మ ఆలయం ఉంది. ఊరిలో పుట్టిన వారికి గజ్జలమ్మ పేరు పెడితే మంచి జరుగుతుందని నమ్మకం. దీంతో గజ్జారాం, గజ్జన్న, గజ్జయ్య, గజేందర్, గజ్జవ్వ, గజలవ్వ, గజక్క అనే పేర్లు అన్ని ఇళ్లలో ఉంటాయి. ఇంట్లో ముగ్గురుంటే పెద్ద గజ్జారాం, నడిపి గజ్జారాం, చిన్న గజ్జారాం, ఆడవారైతే కూడా పెద్ద గజ్జవ్వ, నడిపి గజ్జవ్వ, చిన్న గజ్జవ్వ అని పిలుస్తుంటారు.