జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్
NEWS Jan 30,2026 11:21 am
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ జంతు సంరక్షణపై తన ప్రేమను చాటుకున్నారు. విశాఖ పర్యటనలో ఇందిరా గాంధీ జూ పార్క్‌ను సందర్శించిన పవన్ జూ పార్క్‌లోని నూతన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను ప్రారంభించారు. తన తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా జూ పార్క్‌లోని 2 జిరాఫీలను ఏడాదంతా దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. జిరాఫీల సంరక్షణ ఖర్చును స్వయంగా భరిస్తానని ఆయన తెలిపారు.