ఉదయం గులాబీ..! సాయంత్రం హస్తం..!
NEWS Jan 29,2026 04:44 pm
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయంగా ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 8వ వార్డులో బరిలో ఉన్న అభ్యర్థి తోట గంగాధర్ ఉదయం BRS ఎమ్మెల్యే సంజయ్ అధ్వర్యంలో బీఆర్ఎస్ కండువా కప్పుకొని, ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించారు. ఇదే సాయంత్రం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీలో చేరికలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.