కోరుట్ల ఆర్టీవో కార్యాలయంలో రక్తదాన శిబిరం
NEWS Jan 29,2026 10:17 pm
కోరుట్ల ఆర్టీవో కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని డీటీఓ శ్రీనివాస్ ప్రారంభించారు. ఆర్టీవో కార్యాలయ అధికారులు రియాజ్‌తో పాటు సిబ్బంది, కానిస్టేబుళ్లు, అలాగే మెట్‌పల్లి తనస్వి డ్రైవింగ్ స్కూల్‌కు చెందిన మహేందర్ తదితరులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. డీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో మైనర్ యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళనకరమన్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వాహనాలు ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. రాత్రి సమయంలో వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి నడపకూడదని యువకులకు హితవు పలికారు.