మెట్‌పల్లిలో రెండో రోజు 92 నామినేషన్లు
NEWS Jan 29,2026 10:16 pm
మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింది. ఈ రోజు మొత్తం 92 నామినేషన్లు, 83 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు చూస్తే.. బీజేపీ - 23, కాంగ్రెస్ - 37, బీఆర్‌ఎస్ - 18, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) - 3, ఏఐఎంఐఎం - 4, స్వతంత్ర అభ్యర్థులు - 6, ఇతర గుర్తింపు పొందిన పార్టీ - 1. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని అధికారులు తెలిపారు.