సెంట్రింగ్ లేబర్ సంఘం ఆర్థిక సహాయం
NEWS Jan 28,2026 12:35 pm
మెట్‌పల్లి పట్టణానికి చెందిన బత్తుల మహేష్ ఇటీవల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. తోటి కార్మికుడు మృతి చెందడంతో మెట్‌పల్లి సెంట్రింగ్ లేబర్ సంఘం తరపున ఆయన భార్య బత్తుల లయకు రూ.15,000ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్మిక కుటుంబాలకు అండగా నిలవడం సంఘం బాధ్యత అని అధ్యక్షుడు గద్దల బాలరాజు తెలిపారు. ఉపాధ్యక్షులు దోమకొండ లక్ష్మణ్, పొట్ట ప్రసాద్, మద్దెల నితిన్, సోమిరెడ్డి ప్రదీప్, కోల ప్రశాంత్, అరిసె రాజేష్, మేకల ఉపేందర్‌తో పాటు ఏఐటీయూసీ నాయకులు రామిళ్ల రాంబాబు, ఎండి ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.