45 మందికి పద్మశ్రీ అవార్డులు
NEWS Jan 25,2026 03:01 pm
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం 45 మందికి ‘పద్మ’ పురస్కారాలు 2026 కు గాను ప్రకటించింది. తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డు వరించింది. పాడి, పశుసంవర్ధక విభాగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రకటించింది. తమిళనాడుకు చెందిన నటేశన్, హైదరాబాద్ లోని సీసీఎంబీలో పని చేస్తున్న డా. కుమారస్వామి తంగరాజ్‍కు జన్యుసంబంధ పరిశోధనలకు గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.