ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 96 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.23 లక్షల 74 వేల విలువైన చెక్కులను అందజేశారు. ఆపత్కాలంలో పేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా, పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధిని పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.