బంగ్లాదేశ్: దుకాణంలో నిద్రిస్తున్న ఓ హిందూ యువకుడిని సజీవ దహనం చేశారు. నార్సింగ్డిలో రాత్రి ఓ దుకాణంపై అల్లరి మూకలు దాడి చేశాయి. షట్టర్ మూసివేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించాయి. షాపులో నిద్రిస్తున్న చంచల్ భౌమిక్ (23) అనే యువకుడు సజీవదహనం అయ్యాడు. చంచల్ మరణించాడని నిర్ధరించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.